విశాఖ: RK బీచ్ గోకుల్ పార్క్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళలను లైఫ్ గార్డ్స్ కాపాడారు. గురువారం ఉదయం మహారాణి పేటకు చెందిన కీర్తి ఉషారాణి, సునీత పూజా సామాగ్రిని సముద్రంలో వదలడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కెరటాల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోతుండగా లైఫ్ గార్డ్స్ గమనించి వారిని రక్షించారు.