ATP: జాతీయ యువత, కిశోరబాలికల అభివృద్ధి కార్యక్రమం కింద కేంద్ర ఆర్థికసాయం పొందడానికి స్వచ్ఛంధ సంస్థ (ఎన్జీఓ)లు ఈనెల 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన సంక్షేమశాఖ అధికారి రవిశంకర్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ ఐడీ ఉన్న స్వచ్చంద సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 9849909062 సంప్రదించాలన్నారు.