కోనసీమ: జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం ఈనెల 8న అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారంతో సన్నద్ధం కావాలని ఆదేశించారు.