E.G: జిల్లా వ్యాప్తంగా మన మిత్ర వాట్సాప్ ఆధారిత సేవలపై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం నవంబర్ 7 నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇవాళ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రతి కుటుంబం డిజిటల్ ప్రభుత్వ సేవలను సులభంగా వినియోగించుకోవడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు.