అనకాపల్లి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అచ్యుతాపురం మండలం పూడిమడకలో కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని డిమాండ్ చేశారు.