GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిన్న తెనాలిలో జరిగింది. పట్టణంలోని 11వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని, మహిళల నుంచి సంతకాలు లోస్వీకరించారు. అనంతరం పార్టీ వార్డు కమిటీల నియామకంపై ఆయన ముఖ్య నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.