ప్రకాశం: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న వారికి ప్రభుత్వం సింగపూర్ వెళ్లే అవకాశం కల్పించిందని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. వారిలో జిల్లాకు చెందిన గ్రేడ్-2 హెచ్ఎం ముత్తోజు సుధాకర్ (తర్లుపాడు), ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని బి. సరోజిని (మొగళ్లూరు), సోషల్ టీచర్ జి. ఈశ్వరమ్మ (పీసీ పల్లి), హిందీ టీచర్ గుంటగాని భాస్కరరావు (తంగెళ్ల) ఉన్నారు.