కృష్ణా: మోపిదేవి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో టౌన్ ఫీడర్ లైన్‌పై వాలి ఉన్న చెట్టు కొమ్మలను ట్రిమ్ చేయుట కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఉయ్యూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.వి. సుధాకర్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సబ్ స్టేషన్ పరిధిలోని మోపిదేవి, రావివారిపాలెం గ్రామాలకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు చెప్పారు.