కార్తీకమాసం 16వ రోజు ఇవాళ ప్రతిఒక్కరూ దగ్గరలోని శివాలయం లేదా విష్ణువు ఆలయానికి వెళ్లి చీపురుతో చిమ్మి ముగ్గులు వేయాలి. ఇలా శివాలయంలో చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి. విష్ణువు ఆలయంలో చేస్తే అధికార పదవులు కలుగుతాయని కార్తీక మహత్యం తెలుపుతుంది. ప్రమోషన్లు రావాలన్నా, రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా, సంఘంలో మంచి గుర్తింపు రావాలన్నా విష్ణువు ఆలయంలో ఈ పని చేయాలి.