JGL: ఓకే కాన్పులో ముగ్గురు జన్మించిన అరుదైన ఘటన మేడిపల్లి(మం) లింగంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నోప్పులతో కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. కాగా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు మగబాబు ఉన్నారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యంతో కూడిన సంతోషం వ్యక్తం చేశారు.