PDPL: గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా ఈనెల 11న ప్రత్యేక యాత్రలకు 2 లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశామని గోదావరిఖని RTC డిపో మేనేజర్ నాగభూషణం బుధవారం తెలిపారు. 11న ఉదయం బస్సులు నేరుగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశంభు ఇలా పది యాత్రల దర్శనం అనంతరం 18న గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. వివరాలకు 7382847596 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.