ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలులో కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమీక్షలో జేసీ మాట్లాడారు. ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా ఆర్డీవోలు, తహసీల్దార్లు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.