MDK: ఆన్ లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్సై రాజేష్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన మౌనిక ఇన్ స్టాగ్రామ్ చూస్తుండగా వచ్చిన ఫేక్ లింకును క్లిక్ చేయడంతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 45 వేలు పోయినట్లు ఎస్సై తెలిపారు. సెల్ ఫోన్ లో సంబంధం లేని లింకులను, బెట్టింగ్ యాప్ల జోలికి పోవద్దని ఎస్ఐ హెచ్చరించారు.