జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కిష్త్వార్ జిల్లా ఛత్రూలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అక్కడ ఉగ్రవాదులు నక్కినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో JK పోలీసులు, ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.