HYD: నగరంలోని పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురుచూసే HYD బుక్ ఫెయిర్ ఈ ఏడాది DEC 19 నుంచి ప్రారంభంకానుంది. NTR స్టేడియంలో పది రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రదర్శన మ.12 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందన్నారు.