NLG: పత్తి కొనుగోళ్లపై సమ్మెకు వెళ్లవద్దని జిన్నింగ్ మిల్లుల యజమానులను కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. నిన్న సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో మిల్లుల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. సీసీఐ నిబంధనలు(ఎల్ 1, 2) తమ పరిధిలో లేవని స్పష్టం చేశారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పత్తిని కొనుగోలు చేయాలని ఆమె వారికి విజ్ఞప్తి చేశారు.