SRD: పాశ మైలారం పారిశ్రామిక వాడలోని బిస్లరీ పరిశ్రమలో యూనియన్ పెట్టుకుంటే కార్మికులను తొలగించడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం బుధవారం ప్రకటనలో తెలిపారు. విధుల్లో నుంచి తొలగించిన ఐదుగురు కార్మికులను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను వేధిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.