KMM: రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి సారించాలని, వెనుకబడిన వారికి అదనపు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఉత్తీర్ణత పరంగా రాష్ట్రంలో జిల్లాను టాప్లో ఉంచాలని ఆకాంక్షించారు.