భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.. తన బరువు విభాగాన్ని మార్చుకోనుంది. ఆమె ఇప్పటిదాకా 49 కేజీల విభాగంలో పోటీ పడుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో ఈ విభాగంలోనే రజతం గెలిచింది. కానీ 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ నుంచి 49 కేజీల విభాగాన్ని తొలగించడంతో మీరాబాయి బరువు పెరగాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ఒలింపిక్స్ కోసం 53 కేజీలకు మారనుంది.