తమిళ హీరో ధనుష్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా చేయనున్నారు. ఇందులో కథానాయికగా పూజను మేకర్స్ ఎంపిక చేశారట. ఇది నటనకు స్కోప్ ఉన్న పాత్ర అని, ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ధనుష్, పూజ కాంబోలో రాబోతున్న ఫస్ట్ సినిమా ఇది అని తెలిపాయి.