BDK: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఇల్లందు ఎమ్మెల్యే దంపతులు కోరం కనకయ్య, లక్ష్మీ కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపారు. ఆలయ అధికారులు అర్చకులు ఎమ్మెల్యే దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అర్చకులు అందజేశారు.