HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ప్రచారాన్ని నిర్వహించారు. యూసుఫ్ గూడ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.