MDCL: కాలనీల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కాప్రా డివిజన్ పరిధిలోని షిరిడి నగర్లో 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీల కతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానన్నారు.