NLG: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి మంచి మనస్సును చాటుకున్నారు. శాలిగౌరారం మండలం చిత్తలూరుకు చెందిన అక్కాచెల్లెళ్ల చదువుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 3.25 లక్షల సహాయాన్ని అందించారు. ఎర్ర రాజు చైతన్యల కుమార్తెలు ఎర్ర శ్రీలిఖ్యకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదివేందుకు రూ. 1.25 లక్షలు, శ్రీ అలేఖ్య ఉన్నత చదువు కోసం రూ.2.00 లక్షలు గురువారం అందించారు.