AP: ‘రైతు పరామర్శ’ పేరుతో జగన్ విన్యాసాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. జగన్ మాట్లాడేటప్పుడు వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటే మంచిదన్నారు. ఈనెల 14, 15న జరిగే విశాఖ సదస్సు వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.