NLR: కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలపాలని కోరుతూ జేఏసీ నాయకులు నారా లోకేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు. కావలి నియోజకవర్గంలోని దగదర్తికి వెళ్తున్న లోకేశ్ మోచర్ల దగ్గర హైవేపై కాసేపు ఆగారు. ఈ సందర్భంగా కందుకూరు జేఏసీ నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల వాగ్ధానం, ప్రజాభీష్టం మేరకు కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలని విజ్ఞప్తి చేశారు.