KMM: తల్లాడ మండలం అన్నారం గ్రామంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు పాల్వంచ, తల్లాడ విజన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోడు పంపిణీ కార్యక్రమంను ఇవాళ నిర్వహించారు. గత నెలలో గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల్లో అద్దాలు అవసరమైన వారికి తగిన కొలతలు తీసుకొని సుమారు 100 మందికి ఉచితంగా కళ్లజోడులు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు.