NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌ను ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి శోభారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై అల్పాహారం చేసి బాగుందన్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి వార్డెన్ నాగరాజును అభినందించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టలన్నారు.