KRNL: బెస్త సామాజిక వర్గం ఆర్థిక బలోపేతానికి చొరవ చూపాలని మంత్రి లోకేష్‌కు విన్నవించామని ఏపీ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు గురువారం ఆదోనిలో తెలిపారు. గత ప్రభుత్వం జీఓ 217 తీసుకువచ్చి బెస్త మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. మత్స్యకారులకు భరోసా దక్కక నష్టపోతున్నందున జీఓను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు.