మహిళల హాస్టల్ బాత్ రూమ్లలో స్పై కెమెరాలు కలకలం రేపాయి. ఈ ఘటన తమిళనాడు నాగమంగళగ్రామం పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆ కెమెరాలను అమర్చిన నేరారోపణపై ఓ మహిళను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తగిన భద్రత కల్పించాలని, అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకోవాలంటూ 2000 మంది మహిళలు డిమాండ్ చేయడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.