AP: రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.