అన్నమయ్య: రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం కార్యాలయం తలుపులు మూసివేసి సిబ్బందిని అదుపులోకి తీసుకుని పత్రాలు, రికార్డులను పరిశీలించారు. గత కొన్ని రోజులుగా లంచాలు, అవినీతి లావాదేవీలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయని సమాచారం. ప్రజలు న్యాయమైన సేవలు అందుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.