NRML: కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరడంతో క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లోలు వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా గేట్లు తెరిచి నీటిని వదిలే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నదీ దిగువ ప్రాంత ప్రజలు, పశువులు, రైతులు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని వారు ఈ సందర్భంగా సూచించారు.