కృష్ణా: కార్తీక పౌర్ణమి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ బస్సులు మచిలీపట్నం, మంగినపూడి బీచ్ వరకు నడుస్తాయన్నారు. మచిలీపట్నం కోనేరు సెంటర్, బస్టాండ్, జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి పాండురంగ స్వామి ఆలయం వద్ద నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.