కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. అయితే శివాలయంలో వృత్తాకార ప్రదక్షిణ చేయకూడదని పండితులు చెబుతున్నారు. ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం(శివుని అభిషేకం నీరు ప్రవహించే ప్రదేశం) వరకు వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి.. సోమసూత్రం వరకు వచ్చి మళ్లీ ధ్వజస్తంభం వరకు రావాలి. దీనిని ఒక ప్రదక్షిణగా భావించాలని పండితులు అంటున్నారు.