కృష్ణా: కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల సందర్భంగా మంగినపూడి బీచ్లో విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈరోజు వేకువజామున సముద్ర స్నానమాచరించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. కాశీలో గంగా హారతి మాదిరిగా, మంగినపూడి బీచ్లో పౌర్ణమి రోజున సముద్ర హారతిని ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. సముద్ర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారన్నారు.