యూపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చునార్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పట్టాలు దాటుతుండగా.. రైలు వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఆ ప్రయాణికులు ప్లాట్ ఫాంపై కాకుండా పట్టాల వైపు రైలు దిగినట్లు తెలుస్తోంది.