MNCL: జన్నారం మండలంలోని ఇందన్పల్లి ప్రధాన రహదారిపై స్థానికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారి పక్కన బుధవారం ఉదయం మెయిన్ విద్యుత్ వైరు తెగిపడిపోయింది. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. 2 నెలలుగా చెబుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.