NZB: ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో SRSP గేట్లను మూసివేస్తున్నారు. బుధవారం ఉదయం 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి 21,954 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు.