ASR: డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీ తుర్రుంగుడ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటు చదువులు కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నూతన భవనం నిర్మించాలని కోరుతున్నారు.