VZM: జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం రేపు గురువారం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీ.వీ.సత్యనారాయణ తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ భవనంలో సాధారణ ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి అధికారులు, నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.