MBNR: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని డి.ఎస్.వో శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన SGF కరాటే సెలక్షన్స్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సెలక్షన్లో మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారని వెల్లడించారు.