MDK: పాపన్నపేట మండలంలోని నాగసాన్పల్లి శివారులో రాజగోపురం వద్ద బుధవారం అర్చకులు పార్థివ శర్మ వన దుర్గమ్మ వారికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తెల్లవారుజామున కార్తీక కాకడ హారతి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పంచామృతాల పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో అలంకరించి నక్షత్ర హారతి నైవేద్యం సమర్పించారు.