AP: కళాశాల భవనం పైనుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరులో జరిగింది. కొంగారెడ్డిపల్లికి చెందిన రుద్రమూర్తి(19) మురకంబట్టులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. నిన్న 3వ అంతస్తుపైకి వెళ్లి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమని యాజమాన్యం, పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాలి.