AKP: పెంటకోట గ్రామ సచివాలయంలో అధికారులను కేటాయించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వ్యవసాయ భూముల పాసుబుక్కులు తదితర వాటికోసం దరఖాస్తు చేయడానికి వచ్చేవారు నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నారు. అందువల్ల డిజిటల్ అసిస్టెంట్, ఇతర ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు.