ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train accident) జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఖరగ్‌పూర్ స్టేషన్ సమీపంలో లోకల్ రైలు(Local Train) పట్టాలు తప్పడంతో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతం అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
మేదినీపూర్-హౌరా లోకల్ రైలు(Local Train) స్టేషన్ నుండి బయలుదేరిన వెంటనే ఔటర్‌లోని స్తంభాన్ని ఢీకొట్టడంతో పట్టాలు తప్పింది. అయితే దీనిపై అధికారికంగా సమాచారం లేదు. రైలు ఒక్కసారిగా ఆగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి లోకల్ రైలు మేదినీపూర్ నుంచి హౌరాకు వస్తోండగా ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించారు.
స్టేషన్ నుండి ఆ రైలు నెమ్మదిగా వెళ్లడంతో ప్రమాదం(Train Accident) జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామని సీపీఆర్వో(CPRO) తెలియజేశారు. ట్రాక్‌లో మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వరుస రైలు ప్రమాద ఘటనలపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తమ భద్రతకు ప్రాధాన్యమివ్వాలని రైల్వేశాఖ(Railways)ను కోరుతున్నారు.