బట్టతల వస్తుందని భాధతో ఓ కానిస్టేబుల్ (Constable) ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) యాచారం మండలం గడ్డమల్లాయగూడ గ్రామానికి చెందిన ఆర్ల బుచ్చయ్య, మణెమ్మల కుమారుడు వినోద్ మల్కాజిగిరి (Malkajigiri PS) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వినోద్ కుమార్ (Vinod Kumar) కొంత కాలంగా చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నాడు. అనారోగ్యం కారణంగా 20 రోజులుగా డ్యూటీకి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాడు.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. కాగా, అనారోగ్యంతోనే వినోద్ సూసేడ్ పాల్పడి ఉండొచ్చని భావించారు.
అయితే, తనకున్న చర్మ వ్యాధి (skin disease)కారణంగా.. జుట్టంతా ఊడిపోతుండటంతో వినోద్ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. తన స్నేహితుల వద్ద ఈ వషయాన్ని పదేపదే ప్రస్తావించేవాడు. ఈ నేపథ్యంలో బట్టతల వస్తుందేమో అన్న కారణంతోనే వినోద్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు .బట్టతల(Bald) ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది.
యంగ్ ఏజ్‌లోనే చాలా మందికి జుట్టు ఊడిపోతుంది. పైగా మానసిక ఒత్తిడి (mental stress) పొల్యూషన్ వంటి కారణాలతో చాలా మందికి జుట్టు త్వరగా తెల్లబడుతోంది. బట్టతల కూడా వస్తోంది. దీన్ని లైట్ తీసుకోవాల్సిన యువత.. జుట్టుకు తెగ ప్రాధాన్యం ఇస్తున్నారు. జుట్టు లేకపోతే ప్రపంచం ఏదో తలకిందులవుతోందని భ్రమపడుతున్నారు. బట్టతల ఆత్మన్యూనతా (Self-loathing) భావానికే కాదు.. ఆత్మహత్యకు కూడా దారితీస్తోంది. తాజాగా ఒక వ్యక్తి జుట్టు ఊడిపోతుంది అనే కారణంతోనే సూసైడ్ చేసుకున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ప్రాణం విలువ తెలియకుండా కొందరు చిన్నచిన్న కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నారు.తమనే నమ్ముకుని ఉన్న కుటంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు.