»Suicide A Software Engineer Committed Suicide After Making Millions In Online Gaming
Suicide: ఆన్లైన్ గేమింగ్‌లో లక్షలు పొగోట్టుకుని.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్
ఆన్లైన్లో గేమ్స్ ఆడి చాలామంది డబ్బు పొగోట్టుకుంటున్నారు. వీటికి యువత బలి అయిపోతున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పృథ్వీ ఆన్లైన్ గేమ్స్‌కి బలి అయి ఆత్మహత్య చేసుకున్నాడు.
Suicide: A software engineer committed suicide after making millions in online gaming.
Suicide: ఆన్లైన్లో గేమ్స్ ఆడి చాలామంది డబ్బు పొగోట్టుకుంటున్నారు. వీటికి యువత బలి అయిపోతున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పృథ్వీ ఆన్లైన్ గేమ్స్‌కి బలి అయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన పృథ్వీ ఏడాది కిందట హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే యూపీలోని నోయిడా వెళ్లాలని కంపెనీ చెప్పడంతో రెండు నెలల కిందట అక్కడికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి గదిలో ఉంటున్నాడు. ఈక్రమంలో ఆన్లైన్లో పరిచయం అయిన ముగ్గు వ్యక్తుల గేమ్స్ ఆడేవాడు.
ఆ స్నేహితులు అతనికి ఆన్లైన్ బెట్టింగ్‌కు పరిచయం చేశారు. దీంతో పృథ్వీ వివధ కారణాలతో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల నుంచి రూ.12 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బు అంతా నాలుగు రోజుల్లోనే మాయమైంది. దీంతో డిప్రెషన్లో వెళ్లాడు. ఆఫీస్‌కు వెళ్లకుండా 15 రోజులు గదిలోనే ఉన్నాడు. అప్పు ఎలా తీర్చాలని బాధపడ్డాడు. దీంతో గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.