»Si Sriramulu Ss Who Could Not Bear The Insults Committed Suicide
SI Sriramulu: అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే అవమానాలను భరించలేకే ఆత్మహత్య చేసుకున్నానని తెలిపారని అతని భార్య ఫిర్యాదు చేసింది.
SI Sriramulu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే తన భర్త మృతికి సీఐ జితేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, సన్యాసినాయుడు, సుభాని, శివనాగరాజులే కారణమని ఎస్సై భార్య కృష్ణవేణి హైదరాబాద్ మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చికిత్స పొందే సమయంలో ఎస్సై తనకు ఎదురైన అనుభవాలను కుటుంబసభ్యులతో పంచుకున్నారు. కానిస్టేబుళ్లు అతను చెప్పే పని సరిగా చేసేవారు కాదట.
ఇదేంటి అని అడిగితే ఎదురుతిరిగేవారు. వేరే కానిస్టేబుళ్లతో పనిచేయిస్తుంటే వాళ్లకి అడ్డువచ్చేవారని ఎస్సై చికిత్స తీసుకుంటుండగా చెప్పారు. చాలా ఇబ్బందులు పెట్టారని బాధపడ్డారు. వేరేచోటుకు బదిలీ చేయించుకునేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ఆ ప్రక్రియ కొంత ఆలస్యం కావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారం కిందట ఆత్మహత్య చేసుకున్న ఎస్సైను ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంలో చేర్చారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే అతని మరణవార్త తెలియగానే ఆయన మేనత్త గుండెపోటుతో మరణించారు. ఎస్సైకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.