భారత మహిళల హాకీ జట్టుకు నూతన కోచ్‌ను హాకీ ఇండియా తాజాగా ప్రకటించింది. నెదర్లాండ్స్‌కు చెందిన స్జోర్డ్ మారిజ్నేను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది. ఈయన గతంలో 2017 నుంచి 2021 వరకు భారత మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. కాగా, ప్రస్తుతం చీఫ్ కోచ్‌గా ఉన్న హరేంద్ర సింగ్‌పై వేధింపులు, శిక్షణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలు రావడంతో తన పదవికి రాజీనామా చేశాడు.